సారథి న్యూస్, ఖమ్మం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద 25 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఖమ్మంలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్ కృష్ణ, రాము అనే వ్యక్తులు రేషన్ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరాములు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 18 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.
- July 24, 2020
- Archive
- క్రైమ్
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AUTO
- KAMMAM
- RATION
- RICE
- రేషన్
- సీజ్
- Comments Off on రేషన్ బియ్యం తరలిస్తూ చిక్కారు