- అమెరికాలో ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్
- బిట్‌కాయిన్ అడ్రస్‌కి డాలర్లు పంపాలని మెసేజ్
- ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామన్న ట్విట్టర్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్, బ్లూ టిక్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. బిట్‌కాయిన్ అకౌంట్ అడ్రస్ పెట్టి డబ్బులు పంపితే రెట్టింపు చెల్లిస్తామని మెసేజ్ ఉంచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జాన్ బిడెన్, ఎలన్ మస్క్, జఫ్ బిజోస్ తదితరుల అకౌంట్లను హ్యాక్ చేసి ఆ మెసేజ్పెట్టారు. దీంతో వాళ్ల అభిమానుల్లో కొందరు నిజమే అనుకుని డబ్బులు పంపినట్లు తెలుస్తోంది. ఇదంతా బిట్కాయిన్ల ముఠా పనే అని భావిస్తున్నారు. ప్రముఖుల ఖాతాల హ్యాక్ విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రముఖుల ఖాతాలు హ్యాకర్లుబారిన పడినట్లు గుర్తించిన వెంటనే వాటిని కాపాడామని, ట్విట్టర్ సపోర్ట్ టీం చెప్పింది. దీనిపై ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే కూడా స్పందించారు. ట్విట్టర్‌కు ఇది టఫ్ డే అని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపడంతో పాటు సెక్యూరిటీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.