ఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే బదిలిచ్చే సత్తా భారత్‌కు ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వాఖ్యానించారు. లడ్డాఖ్‌లోని గాల్వన్‌లోయలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనాపై ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షలో ప్రధాని మాట్లాడారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని.. చైనా చర్యలకు తగినసమయంలో తగిన రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్ 19న సాయంత్రం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది.
- June 17, 2020
- Archive
- జాతీయం
- BHARATH
- CHINA
- DELHI
- MODI
- WAR
- గాల్వన్‌లోయ
- భారత్
- Comments Off on రెచ్చగొట్టే చర్యలకు బదులిస్తాం