Breaking News

రూ.140 కోట్లతో 42 చెక్ డ్యామ్​లు

సారథి న్యూస్​,నాగర్​కర్నూల్​: అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు ‘దిశ’ చక్కని వేదిక అని నాగర్​ కర్నూల్​ ఎంపీ, ‘దిశ’ కమిటీ చైర్మన్ పోతుగంటి రాములు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని తిరుమల టవర్స్ లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం ఎంపీ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. దిశ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు ఖర్చు, పథకాలు అమలు తదితరాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఏకగ్రీవంగా ప్రతిపాదించగా, దిశ కమిటీ తీర్మానించింది. నాగర్​కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి కలిపి రూ.140 కోట్ల వ్యయంతో 42 చెక్ డ్యామ్​లు మంజూరు చేసినట్లు తెలిపారు. భారత్, చైనా సరిహద్దులో అసువులు బాసిన కల్నల్​ సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జైపాల్​యాదవ్, కలెక్టర్​ శ్రీధర్​, జడ్పీ చైర్​పర్సన్​ పెద్దపల్లి పద్మావతి, అడిషనల్​ కలెక్టర్ మను చౌదరి, ట్రైనీ కలెక్టర్ చిత్రమిశ్రా, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా అధికారులు హాజరయ్యారు.