నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అలా కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న చాలా చిత్రాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని రిలీజ్కు సిద్ధమవుతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ చేయాలా? లేక ఓ టీటీ ప్లాట్ ఫామ్ ను ఆశ్రయించాలా? అన్న సందిగ్ధం అలాగే ఉన్నప్పటికీ
ముందు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి అనే లక్ష్యంతో చాలామంది నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. అలా తమ తొలి ప్రయత్నం తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి
చేసుకొనే ప్రయత్నంలో ఉంది నూతన చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ అండ్ ఎం క్రియేషన్స్’. ‘యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ సమర్పణలో ఎస్అండ్ఎం క్రియేషన్స్ నిర్మించిన తొలి చిత్రం ‘ క్లూ ‘ షూటింగ్ కార్యక్రమాలు
ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.
బహుభాషా దర్శకుడు భారతీ గణేష్ వద్ద కోడైరెక్టర్ గా చేసిన రమేష్ రాణాను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాతలు సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మించిన యాక్షన్ సస్పెన్స్ అండ్ ట్రెజర్ హంట్ థ్రిల్లర్ ‘క్లూ’ ప్రస్తుతం రీరికార్డింగ్ దశలో ఉంది. కాలగర్భంలో మరుగున పడిన కొన్ని వందల ఏళ్ల నాటి గుప్త నిధి తాలూకు రహస్యాన్ని చేధించి ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నించే ఒక సిన్సియర్ ఆఫీసర్ కు అతని బృందానికి ఎదురైన అనుభవాలు, అద్భుతాల సమాహారమే ఈ కథాంశం. ఈ చిత్రం ద్వారా పృథ్వీశేఖర్ అనే యంగ్ ఫైట్ మాస్టర్ హీరోగా పరిచయమవుతుండగా సబీనా జాస్మిన్, శుభాంగి పంత్, సంజనా నాయుడు, ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఒక కీలక పాత్ర పోషిస్తుండగా ‘మగధీర’ ఫేమ్ దేవగిల్, షియాజీ షిండే, జీవా, మధు
నారాయణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.