Breaking News

రిలయన్స్​కు నష్టం

ముంబై: ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నాలుగు స్థానాలు పడిపోయారు. రిలయన్స్‌ యాన్యువల్‌ మీటింగ్‌లో ముఖేశ్ చేసిన ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో ఆయనకు దాదాపు 2.5 బిలియన్‌ డాలర్ల నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ముఖేశ్‌ 10వ స్థానానికి పడిపోయారు. వారెన్‌ బఫెట్‌, లారీ పేజ్‌, ఎల్‌ముస్క్‌, సర్జీ బ్రిన్‌ ముందుకు వెళ్లిపోయారు. రిలయన్స్‌ – సౌదీ అరామ్‌కో డీల్‌ లేట్‌ అయ్యే అవకాశం ఉందని రిలయన్స్‌ యాన్యువల్‌ మీటింగ్‌లో ప్రకటించిన వెంటనే రిలయన్స్‌ షేర్‌‌ దాదాపు 6 శాతం పడిపోయింది. ‘రిలయన్స్‌ అరామ్‌కో ఒప్పందం అంచనాల ప్రకారం పురోగతి సాధించలేదని, సంస్థ వారి ఓ2సీ వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా మారుస్తుందని మేనేజ్‌మెంట్‌ కామెంట్‌ చేయడం వల్ల విలువ పడిపోయింది’ అని ఎంజెల్‌ బ్రోకరింగ్‌ – డీవీపీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ జ్యోతి రాయ్‌ చెప్పారు. ‘అనుకున్న షెడ్యుల్‌ ప్రకారం సౌదీ అరామ్‌కోతో ఒప్పందం పురోగతి సాధించలేదు. ఒప్పందం పురోగతిపై అందరూ సానుకూల ప్రకటనను ఆశిస్తున్నారు. గూగుల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కాకుండా, తక్కువ ధరకు స్మార్ట్‌ ఫోన్‌ను నిర్మించాలని, వచ్చే ఏడాది 5జీ సర్వీసులను విస్తరించగల ప్రణాళికతో మిగతా ప్రకటనలు చేశారు’ అని షేర్‌‌ఖాన్‌లో సీనియర్‌‌ రిసెర్చ్‌ ఎనలిస్ట్‌ అభిజిత్‌ బోరా చెప్పారు.