Breaking News

రిటైర్డ్​మెంట్​ ఆలస్యం అవుతుంది


లాహోర్: టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్డ్​మెంట్​ కావాలన్న తన ఆలోచన కార్యరూపం దాల్చేలా లేదని పాకిస్థాన్ ఆల్​రౌండర్​ మహ్మద్ హఫీజ్ అన్నాడు. ఈ మెగా ఈవెంట్​లో రాణించి కెరీర్​కు గుడ్​ బై చెబుదామనుకున్నానని చెప్పాడు. ‘కరోనా మహమ్మారితో టీ20 ప్రపంచకప్ జరిగేలా లేదు. ఇందులో ఆడి ఆటకు గుడ్​ బై చెబుదామనుకున్నా. కానీ నా ప్రణాళికలు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 17 ఏళ్లుగా నా ఎంపికకు సరైన న్యాయం చేకూరుస్తున్నాననే అనుకుంటున్నా. కాబట్టి వీలైనంత త్వరగా కెరీర్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా’ అని హఫీజ్ వ్యాఖ్యానించాడు. 2018లో టెస్టులకు గుడ్​ బై చెప్పిన హఫీజ్.. వన్డే ఫార్మాట్​లో కొనసాగుతున్నాడు. ఇప్పటికిప్పుడు క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలు లేవని చెప్పిన ఈ పాక్ బ్యాట్స్​మెన్ ఎవరో ఒకరు స్థానాన్ని భర్తీచేసే వరకు ఆటలో కొనసాగుతానన్నాడు.