Breaking News

రాముడు అందరివాడు

రాముడు అందరివాడు

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం భూమి పూజ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. రాముడు అందరివాడని ఆమె పేర్కొన్నారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంతో దేశమంతా ఒకటవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘రాముడు అనే పదానికి అర్థం సరళత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత, దీనబంధుడు. రాముడో అందరితో ఉన్నాడు. రాముడు, సీతాదేవి సందేశంతో, రామ్‌లాల ఆలయ భూమి పూజ సమాజంలో ఐక్యత, సోదరభావం కలగజేయాలని కోరుకుంటున్నాను’ అని ప్రియాంకగాంధీ ట్వీట్‌ చేశారు. అయోధ్యలో బుధవారం జరగనున్న భూమిపూజకు కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంకగాంధీ ఈ ట్వీట్లు చేయడం గమనార్హం.