ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలో
సారథి న్యూస్, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని అంపిలి గ్రామంలో రాపిడ్ కిట్టుతో తొలి కరోనా టెస్ట్ ను కలెక్టర్ జె.నివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం బీపీ, షుగర్.. ఇతర వ్యాధులు లేకున్నా దగ్గు, జలుబు జ్వరంతో బాధపడుతున్న వారికి రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట సీతంపేట ఐటీడీఏ పీవో సాయివర్మ, పాలకొండ ఆర్డీవో టీవీఎస్ జీ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ లిల్లీ పుష్పనాథం, తహసీల్దార్ జె.రామారావు, వైద్యాధికారులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ కె.చిరంజీవులు పాల్గొన్నారు.