Breaking News

రాజీవ్ సేవలు చిరస్మరణీయం

సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్​ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, నాయకులు పరశురాములు, రవీందర్, శ్రీను, చింటూ, యువజన కాంగ్రెస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.