జైపూర్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సరిహద్దులు మూసివేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారం పాటు ఈ మూసివేత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఇతర రాష్ట్రాలకు అనుమతించనున్నారు. నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) లేనివారిని రాష్ట్రంలోని అనుమతించేంది లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎమ్ ఎల్ లాథర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతే కాకుండా అంతర్జాతీయ విమనాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా చెక్‌పోస్ట్‌లు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో రాజస్థాన్‌లో టాప్ 5లో ఉంది.
బుధవారానికి మొత్తం కేసులు 11,300కి చేరాయి. ఇప్పటి వరకు 256 మంది చనిపోయారు
- June 10, 2020
- Archive
- జాతీయం
- BORDERS
- CARONA
- CHEAKPOST
- TAGS: RAJASTHAN
- అంతర్జాతీయ విమనాశ్రయాలు
- రైల్వే స్టేషన్లు
- Comments Off on రాజస్థాన్ సరిహద్దులు బంద్