సారథి న్యూస్, హుస్నాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు చెందిన రాజగృహంపై దాడులు చేయడం అమానుషమని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్ సదన్ మహారాజ్ పేర్కొన్నారు. గురువారం దళితసంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ముంబై నగరంలో ఉన్న అంబేద్కర్ చారిత్రక నివాస గృహంపై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం రాజ్యాంగ విలువలను అవహేళన చేసినట్లే అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, భిక్షు, ప్రశాంత్, ఆషి, సునీల, రాజశేఖర్, దేవేందర్, హరీశ్ పాల్గొన్నారు.
- July 16, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- AMBEDHKAR
- KARIMNAGAR
- MUMBAI
- RAJAGRUHA
- దళితసంఘాలు
- హుస్నాబాద్
- Comments Off on రాజగృహపై దాడి అమానుషం