మాస్కో: ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ప్రకటించిన రష్యా.. వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ మేరకు రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ వార్తాకథనాలను వెలువరించింది. మాస్కోలోని గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్టు చివరకు వరకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా ప్రకటించింది. ఈ టీకాపై పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ రష్యా మాత్రం వాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. కాగా రష్యా ప్రకటించిన వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ముందస్తు ఆర్డర్లు ఇచ్చాయి. సుమారు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. కాగా, పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేయకుండానే వ్యాక్సిన్ తీసుకొచ్చారని.. ఇది చాలా ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఎం అభ్యంతరం వ్యక్తం చేసింది.
- August 15, 2020
- Archive
- Top News
- జాతీయం
- MASCO
- VACCINE
- WHO
- ఉత్పత్తి
- డబ్ల్యూహెచ్‌వో
- ప్రారంభం
- రష్యా
- వ్యాక్సిన్
- Comments Off on రష్యాలో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం