Breaking News

యువకుడిని కాపాడిన పోలీసులు

సారథిన్యూస్​, సిద్దిపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. అతడి మొబైల్​ నంబర్​ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. సిద్దిపేటకు చెందిన కాశితే శ్రీనాథ్​ గురువారం రాత్రి ఇంట్లో గొడవపెట్టుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లాడు. దీంతో అతడి తండ్రి ఐలయ్య వన్​టౌన్​ పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ సైదులు, ఐటీ సిబ్బందితో కలిసి శ్రీనాథ్​ మొబైల్​ నంబర్​ ఆధారంగా అతడు స్థానిక ఎల్లమ్మ ఆలయం పరిసరప్రాంతాల్లో ఉన్నట్టు జీపీఎస్​ ఆధారంగా గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడా శ్రీనాథ్​ చేయికోసుకొని కనిపించాడు. వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించారు. అనంతరం అతడికి కౌన్సెలింగ్​ ఇచ్చి ఇంటికి పంపించారు.