ఇటీవల కాలంలో తమన్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ను సాధించాయి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమానే అందుకు నిదర్శనం. దాంతో తమన్ డిమాండ్ మరింత పెరిగింది. వరుస చిత్రాల ఆఫర్లతో బిజీ అయ్యాడు తమన్. శివర నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ సినిమాకి తమన్ బ్యాక్ డ్రాప్ నిస్తున్నాడు. ఆల్రెడీ ట్యూన్స్ కంపోజింగ్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం. గతంలో తమన్ నాని, నివేదా థామస్ నటించిన ‘నిన్ను కోరి’ సినిమాకి కూడా బ్యాక్ డ్రాప్ నిచ్చాడు. ఈ సినిమాకి మరింత అట్రాక్టివ్ ట్యూన్స్నిచ్చాడని ఈసారి తమన్ పాటలు ఈ సినిమాకు మంచి ఎస్సెట్ అవుతాయని అంటున్నాడు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ యేడాది సెప్టెంబర్ ఆఖరుకి సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది కాని వచ్చే యేడు ఆరంభంలోకాని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
- June 28, 2020
- Top News
- ALLUARJUN
- THAMAN
- THRIVIKRAM
- అల్లు అర్జున్
- తమన్
- నాని
- Comments Off on మ్యూజిక్ తో మ్యాజిక్..