సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ వాగు, పిల్లివాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో గురువారం సాయంత్రం గుర్తుతెలియని ఓ యువకుడి డెడ్‌బాడీ కొట్టుకువచ్చినట్లు తెలిపారు. కొట్టుకొచ్చిన మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- October 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KOHEDA
- medak
- కోహెడ
- బస్వాపూర్
- మెదక్
- మోయతుమ్మెదవాగు
- సిద్దిపేట
- Comments Off on మోయతుమ్మెద వాగులో యువకుడి డెడ్‌బాడీ