Breaking News

మోదీ పాలన అవినీతి రహితం

BJP

సారథి న్యూస్, ములుగు: ప్రధాని నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతున్నదని బీజేపీ నాయకుడు భూక్య జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం ములుగులో మోదీపాలన పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంబిడి లక్ష్మణ్​ రావు, బుర్ర మహేష్, బైకని రాజు, సాంబరాజు కిరణ్, కన్నెబొయిన వీరెందర్, కొప్పుల రజనికర్, ఆకుల సాంబయ్య, గంగుల రాజు, రామిడి కరుణాకర్ రెడ్డి, జంగిలి సతీష్, జంగిలి రవీందర్, రాంచందర్, తంగాళ్లపల్లి శ్రీధర్, బీట్ల ప్రసాద్, కొలనుపాక సదా శివుడు తదితరులు పాల్గొన్నారు.