![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/02.jpeg?fit=728%2C1024&ssl=1)
సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి) : ధరణి పై మొక్కలు పెంచితెనే జీవరాశికి ప్రాణవాయువు లభిస్తుందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకు డు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. గురువారం 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉప్పల శ్రీనివాస్ గుప్త అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరేల్లిలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ప్రాణాన్ని ఇస్తే.. మొక్క ప్రాణ వాయువును ఇస్తుందని, ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు, హరిత తెలంగాణ ధ్యేయంగా సీఎం కేసీఆర్ గత 6 సంవత్సరాలుగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం భావి తరాల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారని
పేర్కొన్నారు.