సారథి న్యూస్, రామడుగు: ఈనెల 22న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, 24న మంత్రి కేటీఆర్ జన్మదినం రోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటలనే సందేశంతో జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వివేకానంద రూపొందించిన పోస్టర్ ను మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు విడుదల చేశారు. గిఫ్టులు కాకుండా మొక్కలు నాటి విషెస్ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కటుకం రవిందర్, సర్పంచ్ చంటి జీవన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లోకిని స్వామి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్కపెల్లి లచ్చయ్య పాల్గొన్నారు.
- July 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KTR
- VINOD BOINAPALLY
- కేటీఆర్
- తెలంగాణ ఫౌండేషన్
- వినోద్
- Comments Off on మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపండి