Breaking News

మొక్కలు ఎదిగితేనే సార్థకత

మొక్కలు ఎదిగితేనే సార్థకత

సారథి న్యూస్, మెదక్: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, వాటిని బతికిస్తేనే హరితహారం కార్యక్రమానికి సార్థకత ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీళ్లుపోశారు. స్కూలు ఆవరణలో వెయ్యి మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మొక్కలను దత్తత ఇచ్చి కాపాడే బాధ్యతను అప్పగించాలన్నారు. ఇళ్ల వద్ద నాటుకునేందుకు అవసరమైన పండ్లు, పూల మొక్కలను అందచేయడంతో పాటు స్కూలు ఆవరణలో చింత, వేప, నేరేడు మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దేవయ్య పాల్గొన్నారు.