- ‘సారథి’ కథనానికి విశేష స్పందన
- సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు
సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’ శీర్షికన గత సోమవారం ‘సారథిమీడియా’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, రాగం సతీశ్ బాధితుడి కుటుంబంతో మాట్లాడారు. సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
వారితో పాటు చిప్పకుర్తి వాసి సందపలకల మహేందర్, నిజామాబాద్ వాసులు చిలముల బాబు, యల్ల జనార్ధన్ రెడ్డి, తాడుక తిరుపతి, పిచెట్టి రోహిత్, లక్కరం ధనరాజ్, నరగన దుర్గారావు, కల్లే మహేష్, బొనగిరి మహేందర్ రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ మొత్తాన్ని రామడుగు యువకుడు తోట కృష్ణ అపోలో హాస్పిటల్ లో బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు. సహాయం చేయడానికి సహకరించిన ఎలగందల హరీశ్, విదేశాల నుంచి ఆర్థిక సాయం చేసిన దాతలు, అందుకు సహకరించిన తోటకృష్ణను గ్రామస్తులు అభినందించారు. కాగా, బాధితుడి కుటుంబసభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.