డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో వస్తున్న సినిమాలకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. తాజాగా జీ5లో మరో వెబ్ సిరీస్ ఈ నెలాఖరున రిలీజ్ కాబోతోంది. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ‘రోబో’ చిత్రాన్ని నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు శంకర్ తెరకెక్కించిన ‘నన్బన్’ (తెలుగులో స్నేహితుడు) సినిమాకు అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘మేక సూరి’. సుమయ, అభినయ్ ను కీలకపాత్రల్లో పరిచయం చేస్తూ నిర్మించిన వెబ్ సిరీస్ ‘మేక సూరి’. ‘మోసగాళ్లకు మోసగాడు, ఒక్కక్షణం’, వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ చిత్రానికి అసిస్టెంట్ రైటర్‌గా పనిచేసిన త్రినాథ్ వెలిసెల ఈ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సిరీస్‌లో సూరి మేక తోలు వలిచి మాంసం అమ్మే వృత్తిలో కనిపిస్తాడు. కసాయి వాడైన సూరి అందమైన అమ్మాయి రాణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఊరిలో ఉన్న ప్రతిఒక్కరి కన్నూ ఆమె మీదే ఉంటుంది. హఠాత్తుగా రాణి దారుణహత్యకు గురవుతుంది. రాణిని హత్య చేసింది ఎవరని వెదుకుతూ.. వాళ్లని చంపే ప్రయత్నం చేస్తాడు సూరి. రెండు భాగాలుగా రానున్న ఈ సిరీస్ తొలి పార్ట్ ఈనెల 31న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
- July 20, 2020
- Archive
- సినిమా
- KARTHIK KANCHERLA
- MEKA SURI
- NORTH INDIA
- నన్బన్
- మేక సూరి
- రోబో
- Comments Off on ‘మేక సూరి’ మొదటి సిరీస్