సారథి న్యూస్, రామడుగు: పంటల మార్పుతోనే వ్యవసాయంలో సమృద్ధిగా లాభాలు వస్తాయని కరీంనగర్ జిల్లా రామడుగు ఏఈవో యాస్మిన్ అన్నారు. అగ్రికల్చర్ అధికారులు సూచించిన ఎరువులు, విత్తనాలు మాత్రమే వాడాలని సూచించారు. స్థానిక ఎంపీడీవో ఆఫీసులో మంగళవారం వానాకాలం పంటసాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టిపెట్టాలన్నారు. రైతులు వానాకాలంలో వరి, పత్తితో పాటు కంది, పెసర పంటలు వేయాలన్నారు. స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్ గౌడ్, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రవి, సర్పంచ్ జీవన్, రైతు సమన్వయ సమితి నాయకుడు కర్ణాకర్ పాల్గొన్నారు.
- May 26, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- AEO
- KARIMNAGAR
- అగ్రికల్చర్
- కరీంనగర్
- రామడుగు
- Comments Off on మేం చెప్పిన పంటలే వేయండి