సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కానుంది. గతనెల 25న హరిత హారం కార్యక్రమ ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ నర్సాపూర్ కు వచ్చిన సందర్భంగా మాసాయిపేట మండలం ఏర్పాటుకోసం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గుర్తుచేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ధర్మారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించగా చీఫ్ సెక్రటరీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేశారు.
- July 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CHEGUNTA
- MUSAIPETA
- VELDURTHI
- మాసాయిపేట
- మెదక్
- సీఎం కేసీఆర్
- Comments Off on మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం