సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ సమయంలో ఏదైనా విపత్తులు, ఇళ్లు కూలిపోయే ప్రమాదాలు ఉంటాయన్నారు. ఏమైనా సమస్యలు, విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే సమాచారం అందించేందుకు మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ నగేష్ వివరించారు. ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన 08452–2 23360, 7995088720 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
- August 17, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- ADDL COLLECTOR
- CONTROLROOM
- HEAVY RAINS
- medak
- అడిషనల్ కలెక్టర్ నగేష్
- కలెక్టరేట్
- మెదక్
- Comments Off on మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్