‘కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబాన్ని.. దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్..’ అంటూ ట్విటర్లో ఒక వీడియో ట్వీట్ చేస్తూ మెగాస్టార్ సందేశాన్నిచ్చారు. చిరునవ్వు ముఖానికి అందం..కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషారెబ్బతో కలిసి చేసిన చిరు సందేశం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలాంటిదే ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయతో కలిసి మరో వీడియో సందేశాన్ని కూడా అందించారు.
‘మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం..’ అంటూ షేర్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ, ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించుకుందామంటూ మోగాస్టార్ వీడియోల ద్వారా విజ్ఞప్తి చేయడం అందరినీ ఆలోచింపజేస్తోంది.