Breaking News

మెగా ప్రాజెక్ట్ దక్కించుకున్న డైరెక్టర్

మెగా ప్రాజెక్ట్ దక్కించుకున్న డైరెక్టర్..


‘లూసిఫర్’ మలయాళ రీమేక్ పై మనసుపడ్డ మెగాస్టార్ ఆ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి డైరెక్షన్ ఎవరికి అప్పజెబితే బాగుంటుదో అన్ని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను స్క్రిప్టు సరిచేయమన్నారు. వాళ్లలో తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇచ్చిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆయననే దర్శకుడిగా కన్ఫామ్ చేశారు చిరంజీవి. రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీని గురించి చిరంజీవి చెబుతూ ‘తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులతో మోహన్ రాజా నేరేషన్ నాకు నచ్చింది. సంక్రాంతి తర్వాత సెట్స్ కు వెళతాం.. ఏప్రిల్ కి షూటింగ్ కంప్లీట్ చేస్తాం’ అన్నారు. చిరంజీవి గారి హిట్లర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తనకు ఇప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేసే చాన్స్ రావడం హ్యాపీగా ఉందంటున్నారు రాజా. చిరంజీవితో సహా అందరికీ నచ్చే మార్పులు, చేర్పులతో అద్భుతంగా స్క్రిప్ట్ రెడీ చేశాడు మోహన్ రాజా. ఎడిటర్ మోహన్ కొడుకైన మోహన్ రాజా తన తమ్ముడు జయం రవి హీరోగా తమిళంలో వరుస సక్సెస్ లు అందుకున్నాడు. అందులో ఒకటైన ‘తనీ ఒరువన్’ చరణ్ హీరోగా (ధృవ) తెలుగులో రీమేక్ అయింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో టచ్ లో ఉంటున్న మోహన్ రాజా ఎట్టకేలకు చిరంజీవిని డైరెక్ట్ చేసే చాన్స్ అందుకున్నాడు. ఈ మెగాచాన్స్ కోసం తమిళ ‘అంధాదూన్’ రీమేక్ చేసే చాన్స్ కూడా వదులుకున్నాడు.