సిద్దార్థ షాలిని నటించిన ‘ఓయ్’ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఆనంద్ రంగ ఆ తర్వాత మరే సినిమా డైరెక్షన్ చెయ్యలేదు. అయితే ఇప్పుడో మాంచి చాన్స్ అందుకున్నాడట. మెగాస్టార్ ముద్దుల తనయ సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి.
కరోనా కారణంగా థియేటర్లు రీఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో చాలా మంది వెబ్ సిరీస్‌ల నిర్మాణం ప్రారంభిస్తున్నారు. ఈ కోవలోనే మెగా డాటర్ సుస్మిత కూడా వెబ్ సిరీస్‌తో కొత్త అడుగులు వేయడం మొదలుపెట్టింది. అయితే సుస్మిత నిర్మించనున్న వెబ్ సిరీస్‌కు ఆనంద్ రంగ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ‘ఓయ్’ తరువాత ఆనంద్ రంగ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఆఫర్ కూడా దక్కలేదు. అలాంటి ఆనంద్ రంగకు సుస్మిత వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌కు ‘ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఫైర్’ అనే టైటిల్‌ని ఫైనల్ చేశారట. ప్రకాష్‌రాజ్ లీడ్ రోల్‌లో నటించనున్న ఈ వెబ్ సిరీస్‌లోని మరో కీలక పాత్రలో సంపత్‌రాజ్ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.