సారథి న్యూస్, చొప్పదండి: అక్రమ ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని, అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి స్టేజ్ వద్ద సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆగమేఘాల మీద మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ మండల ఉపాధ్యక్షుడు జాతరగొండ ఐలయ్య, ప్రధాన కార్యదర్శి వెలుముల రమేష్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, చంద్రమౌళి, వేముండ్ల కుమార్, ఎడవెళ్లి రాజిరెడ్డి, పోచయ్య, బొల్లం రమేష్, మొట్ట మహేందర్, అమీరిశెట్టి సురేష్, గొండ మధు, వెలుముల రాయడు, వేముల గణేష్ పాల్గొన్నారు.
- October 13, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- MUNCIPAL ACT
- BANDI SANJAY
- CM KCR
- LRS
- ఎల్ఆర్ఎస్
- బండి సంజయ్
- మున్సిపల్చట్టం
- సీఎం కేసీఆర్
- Comments Off on మున్సిపల్ చట్టంతో తొందరేముంది?