- ప్రధాని నెమలితో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు
- ప్రధానమంత్రి మోడీపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. మోడీ నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారనీ, ప్రజలంతా ఎవరి జీవితాలను వారే కాపాడుకోవాలని సూచించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘భారత్‌లో కరోనా కేసులు ఈ వారంలో 50 లక్షలు చేరుకోనున్నాయి. ఒక వ్యక్తి ఆహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్ పూర్తిగా విఫలమైంది. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ గురించి చెబుతున్నది. అంటే దానర్థం మీ (ప్రజలు) జీవితాలు మీరే కాపాడుకోవాలని. ఎందుకంటే ప్రధాని నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు.