సారథి న్యూస్, రామగుండం: మూడు నెలల క్రితం ఆస్పత్రిలో వదిలేసిన పసిపాప ప్రాణాలను నిలిపి, అరోగ్యవంతురాలుగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆ చిన్నారిని ఐసీడీఎస్, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, తోడేటి శంకర్ గౌడ్, ప్రేమ్ సాగర్ ఉన్నారు.
- July 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- MLA KORUKANTI
- RAMAGUNDAM
- ఐసీడీఎస్
- కోరుకంటి చందర్
- రామగుండం
- Comments Off on మానవత్వం.. అభినందనీయం