Breaking News

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్​ నేత ప్రణబ్‌ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఏఎన్ఐ తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాసంస్థలు వెల్లడించాయి. తనకు కరోనా సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, గత వారం రోజుల్లో తనను కలిసినవారెవరైనా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాకబు చేశారు. ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ హెల్త్​కండీషన్​ను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్​, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరులు ట్వీట్లుచేస్తున్నారు.