సారథి న్యూస్, వాజేడు(ములుగు): మహిళలు స్వశక్తితో ఎదగాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. తస్లీమా చిన్నకుమారుడు సుహాన్ పుట్టినరోజు కానుకగా బుధవారం నిరుపేద మహిళ సంగి ఉమకు కుట్టు మిషన్ అందించి దాతృత్వం చాటుకున్నారు. కరోనా సమయంలో ఏదైనా వేడుకలు చేసుకోలేకపోతున్న వారు పేదలకు ఏదైనా దానం చేసి దాతృత్వం చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, డాక్టర్సంతోష్, సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడిపల్లి రమేష్, చంటి శామ్యూల్, అస్మా, సుజాత పాల్గొన్నారు.
- September 23, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MULUGU
- SARVAR FOUNDATION
- WOMENEMPOWERMENT
- మహిళాసాధికారత
- ములుగు
- సర్వర్ ఫౌండేషన్
- Comments Off on మహిళలు స్వశక్తితో ఎదగాలి