Breaking News

మహమ్మారిని కట్టడిచేద్దాం

కరోనాను కట్టడిచేద్దాం

సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా(కోవిడ్​–19) మహమ్మారిని కట్టడిచేసేందుకు స్పీకర్లు కృషి చేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్​ లతో మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతిఒక్కరూ డౌన్ లోడ్ చేసుకుని, వినియోగించేలా అవగాహన పెంచాలని పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్​ నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. మే 3వ తేదీ వరకు లాక్​ డౌన్​ ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 35,277 మందికి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 757 పాజిటివ్ కేసులు ఉండగా అందులో  639 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. 22 మంది మృతి చెందారని, 96 మంది వైద్యం అనంతరం కొలుకున్నారని, వారిని డిశ్చార్జ్ చేశామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేసులు లేవని చెప్పారు.

339 క్వారంటైన్​ కేంద్రాలు నిర్వహిస్తున్నారని వాటిలో 6,856 మంది ఉంటున్నారని వివరించారు. రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్​ వివరించారు. కరోనా సమాచారాన్ని 104 ఫోన్ నంబర్​కు అందించే ఏర్పాట్లు చేశారని, 14410 టోల్ ఫ్రీ నంబర్​ ద్వారా టెలీ మెడిసిన్ సౌకర్యం కల్పించారని చెప్పారు. 8297 104 104 టోల్ ఫ్రీ నంబర్​ ద్వారా ప్రజలు కోవిడ్ తాజా సమాచారం వివరించారు. శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సారథ్యంలో జిల్లా యంత్రాంగంలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ, వలంటీరు వ్యవస్థ ఎంతో ఉపయోగపడిందన్నారు. సీఎం వైఎస్​జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కరోనా నివారణకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో జేసీ- 2 ఆర్.గున్నయ్య, డీఆర్వో బలివాడ దయానిధి, డీఎంహెచ్​వో ఎం.చెంచయ్య, అడిషనల్​ డీఎంహెచ్​వో డాక్టర్​ బి.జగన్నాథరావు, వైద్యశాఖ అధికారి డాక్టర్​ రామ్మోహన్​ రావు పాల్గొన్నారు.