Breaking News

మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శం

మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శం

సారథి న్యూస్, రామగుండం: మహనీయుల జీవితాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీరామ విద్యానికేతన్ ఆవరణలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి, స్వామి వివేకానంద 150వ జయంతి, జాతీయ యువజన వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, ప్రముఖ న్యాయవాదులు గంట నారాయణ, మేడి చక్రపాణి, విద్యానికేతన్ హెచ్​ఎం జ్యోతి, వెంకటేష్, ప్రముఖ వైద్యులు ఎస్.నారాయణ, సాయి పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్​

కులవృత్తులకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం 42వ డివిజన్ లో విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్న వారికి భరోసాగా నిలుస్తున్నారని అన్నారు. సంఘం సభ్యులు ఐకమత్యంగా ఉండి సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ బాలరాజు కృష్ణమూర్తి, శ్రీనివాసులు పాల్గొన్నారు.