వైవిధ్యభరితమైన సినిమాలు చేయడంలో చియాన్ విక్రమన్ ను మించిన వారు లేరు. అజయ్ జ్ఞనాముత్తు దర్శకత్వంలో కోబ్రా, మణిర్నతం డైరెక్షన్లో పొన్నియన్ సెల్వన్ వంటి భారీబడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న విక్రమ్ ‘పేట’ ఫేమ్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నాడు. సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనుంది. విక్రమ్‌కు 60వ చిత్రమైన ఈ క్రేజీ ప్రాజెక్టులో తన తనయుడు ధృవ్ కూడా కీలకపాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాదు తండ్రీకొడుకులిద్దరూ ఒకరికొకరు పోటాపోటీగా కనిపించనున్నారట.
విక్రమ్ కూడా తన కొడుకుతో కలిసి నటించేందుకు మాంచి ఇంట్రెస్ట్‌గా ఉన్నాడట. వాళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. కోలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో ధృవ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కూడా బాగానే ఆడింది. మున్మందు కూడా కొడుకుతో కలిసి నటించేందుకు మంచి కథలను సిద్ధం చేయాల్సిందిగా కొంతమంది ప్రముఖ డైరెక్టర్లకు చెప్పాడట విక్రమ్. తనయుడిపై ఇంత శ్రద్ధ తీసుకుంటున్న విక్రమ్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.