నవదీప్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా లక్ష్మికాంత్ చెన్న దర్శకత్వంలో మర్డర్ మిస్టరీగా ‘రన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా ఒరిజినల్ ఫిలిమ్ గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న ఆహాలో స్ర్టీమింగ్ కానుంది.
కాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నవదీప్, పూజిత కొత్తగా పెళ్లయిన జంటగా ఓ కొత్త ఇంట్లో అడుగు పెట్టడంతో ట్రైలర్ మొదలయ్యింది. తర్వాత పూజితను ఎవరో కత్తితో మెడను కోసి చంపడం.. దాంతో అనుమానితుడిగా ఆమె భర్త నవదీప్ ను పోలీసులు ఇంటరాగేషన్ చెయ్యడంతో నవదీప్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు. హత్య ఎవరు చేసారో నిర్థారణ కాకపోవడం.. నవదీప్ తప్పించుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే అతనే కారణమేమో అనిపిస్తోంది. ‘తప్పు చేసినవాడే పారిపోతాడు.. ఒక్క మర్డర్ చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో మర్డర్లు చేసుకుంటూ పోతున్నాం..’ అంటూ సాగే డైలాగ్స్ తో సినిమాపై మరింత క్యూరియాసిటీ కల్పిస్తూ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ట్రైలర్.
నిజానికి హత్య ఎవరు చేసారు? అది ఎలా ప్రూవ్ అయ్యిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నవదీప్ ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్ పై పరిమితమైపోయాడు. ఇప్పుడీ ఆహా వారి సినిమాతో నైనా నవదీప్ ఆహా అనిపిస్తాడేమో చూడాల్సిందే. ఇంకా ఈ చిత్రంలో వెంకట్, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, మనాలి రాథోడ్, షఫీ, మధునందన్ ఇతర కీలకపాత్రలు పోషించారు.