Breaking News

మరో ​టీజర్​తో నరేష్ ​ట్రీట్

మరో ​టీజర్​తో నరేష్ ​ట్రీట్

దర్శకుడు గిరి పాలిక ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లరి నరేష్, పూజాఝవేరి జంటగా కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటెర్​టైనర్​గా రానున్న ఈ చిత్ర టీజర్ అల్లరి నరేష్​ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. భారీ కామెడీ క్యాస్టింగ్ తో కూడిన ‘బంగారు బుల్లోడు’ టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్​లో ‘ఇది లలితా జ్యూలరీ షాప్ అనుకున్నారా? లాకర్ రూమ్ అనుకున్నారా?’ అన్న డైలాగ్​లో అల్లరి నరేష్ గోల్డ్ లోన్ సెక్షన్ లో పనిచేసే బ్యాంకు ఉద్యోగి అని అర్థం అవుతోంది. ఈ కామెడీ ఎంటర్​టైనర్ లో బంగారం చోరీ వ్యవహారం కథలోని కీలక విషయం..‘ఏమైనా తేడా వస్తే అందరూ కలిసి పోలీస్ స్టేషన్​లో ఇరుక్కోవాలి..’ అన్న డైలాగ్​లో అర్థమైంది.

‘అందరూ పెళ్లిళ్లు అవ్వాలని గుళ్లో ముడుపులు కడతారు.. కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నాను..’ అన్న పోలీసు డైలాగ్​తో కథ మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థం కాగా.. తాకట్టు విడిపించుకున్న నక్లెస్​లో మల్లెపూలు ఇరుక్కొని ఉండటం చూసి.. ‘ఇదేంటి నక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టుంది అంటే.. ఇప్పుడైనా నమ్ముతారా మా బ్యాంక్ మీ నగల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందన్న ..’ డైలాగ్​ల టైమింగ్ .. రైమింగ్ బాగా కుదిరి తన కామెడీ గ్యాంగ్​తో ‘బంగారు బుల్లోడు’ బాగానే అలరించనున్నాడని అర్థమవుతోంది. హీరోయిన్ పూజా ఝవేరి గ్లామర్ ఆకట్టుకోగా, 30 ఇయర్స్ పృథ్వి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి, ప్రభాస్ శ్రీను, మహేష్ మిగిలిన రోల్స్ పోషించారు. వీర బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.