తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తాడమ్’ రీమేక్ గా మిల్కీ బోయ్ రామ్ నటిస్తున్న ‘రెడ్’ఓటీటీలో రిలీజ్ కానుందనే పుకార్లు వచ్చాయి. దీనిపై స్పందించిన రామ్..ఎంత ఆలస్యమైనా ‘రెడ్’మూవీ థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశాడు. గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడు రామ్. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ‘రెడ్’మూవీ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ అయ్యాడు. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సురేంద్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా వార్తలు వస్తున్నాయి. అది కూడా మాస్ ఎంటర్ టైనర్స్‌కు కేరాఫ్ గా నిలిచిన సినిమా ‘రేసుగుర్రం’మూవీకి సీక్వెల్ గా వీరి కాంబినేషనల్లో తెరకెక్కనుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ముందు అల్లు అర్జున్ తో ‘రేసుగుర్రం’ కాంబినేషన్ ని రిపీట్ చేయాలని సురేందర్‌రెడ్డి ప్లాన్ చేశాడట. ఇంతలో బన్నీ ‘పుష్ప’మూవీకి కమిటయ్యాడు. కరోనా కారణంగా ఆ మూవీ ఇంకా సెట్స్ కి వెళ్లకపోవడం మరింత ఆలస్యమయ్యేలా కనిపించడంతో ఇప్పుడు ‘రేసుగుర్రం’ సీక్వెల్ ను రామ్ తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు రామ్ తో తెరకెక్కించబోయే సినిమా ఏ మేరకు సక్సెస్ అవనుందో.
- July 10, 2020
- Archive
- సినిమా
- RAM
- RED
- TADAM
- అల్లు అర్జున్
- రామ్
- రేసుగుర్రం
- Comments Off on మరో రేసుగుర్రం..