న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈసారి మైండ్ బ్లాక్ అంటున్నాడు. టాలీవుడ్ హిట్ పాటలకు స్టెప్పులేస్తూ.. అదరగొడుతున్న వార్నర్ తాజాగా మరో వీడియో రిలీజ్ చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్ సాంగ్’కు తన భార్య క్యాండీస్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ ను విడుదల చేశాడు. కష్టమైన ఈ డ్యాన్స్ బీట్ కోసం 51 టేక్స్ తీసుకున్నట్లు చెప్పాడు. వార్నర్ గతంలోనూ ‘బుట్టబొమ్మా’, ‘పక్కా లోకల్’ సాంగ్‌లతో పాటు బాహుబలి, పోకిరి డైలాగ్‌లతో అలరించిన సంగతి తెలిసిందే.
- May 31, 2020
- Top News
- క్రీడలు
- AUSTRALIA
- TOLLYWOOD SONG
- WARNER DANCE
- డేవిడ్ వార్నర్
- బుట్టబొమ్మా
- మైండ్ బ్లాక్ సాంగ్
- Comments Off on మరోసారి అదరగొట్టిన వార్నర్