ముంబై: మహారాష్ట్రలోని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం మాతృభాష అమలుపై కఠినంగా వ్యవహరిస్తున్నది. బాల్ థాక్రే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నది. అన్ని రకాల కార్యకలాపాలు, అధికారిక ఉత్తర్వులు మరాఠీలోని కొనసాగించాలని అదేశించింది. ఈ ఆదేశాలను అతిక్రమించే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకుంటామని.. అవసరమైతే వారి వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్‌లో ‘మరాఠిని వాడటంలో విఫలమైన వారి సర్వీస్ బుక్‌లో నెగెటివ్ మార్క్స్ వేస్తాం. వార్షిక ఇంక్రిమెంట్‌ను నిలిపేస్తాం’ అని వెల్లడించింది.
- July 1, 2020
- Archive
- జాతీయం
- MAHARASHRTRA
- MARATHI
- SHIVSENA
- UDDHAV
- బాల్ థాక్రే
- మాతృభాష
- Comments Off on మరాఠీ వాడకపోతే జీతం కట్