Breaking News

మంచు విష్ణు.. శ్రీను వైట్ల ‘ఢీ అంటే ఢీ’


వరుస ప్లాపులతో సతమతవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల.. మంచు విష్ణుతో ఓ సినిమా తీయనున్నట్టు సమాచారం. 2007లో వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన ’ఢీ‘ సినిమా సూపర్​హిట్​ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సిక్వెల్​గా ‘ఢీ అంటే ఢీ’ పేరుతో మరో చిత్రాన్ని తీయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్​ నడుస్తోంది. ‘దూకుడు’ సినిమా తర్వాత పెద్దగా ఫామ్ లో లేని వైట్ల ఈ కొత్త సినిమాకి స్క్రిప్ట్​ కూడా సిద్ధం చేశాడట.

‘ఢీ’ సినిమా ఎంత హిట్ సాధించిందో అంతకంటే డబుల్ డోస్​తో దీని సీక్వెల్ ఉంటుంది అంటున్నాడు వైట్ల. తన రైటర్స్ టీంతో మూడు నెలల పాటు చర్చలు జరిపాక స్క్రిప్టు రెడీ చేశాడట. సినిమా నిర్మించేందుకు హీరో విష్ణు కూడా ఆమోదం తెలుపడంతో ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ ప్రారంభించనున్నారట. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.