సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి ఈనెల 2న కన్నుమూసింది. ఆమె మృతి కుటుంబంలో విషాదం నింపగా ఈనెల 30న దినకర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులంతా వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. అంతలోనే కొత్తపల్లి లక్ష్మి భర్త మొగిలయ్యకు ఛాతీలో నొప్పిరాగా అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందడంతో కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. 10 రోజుల్లోనే తల్లిదండ్రులు ఇద్దరు ఆ కుటుంబానికి దూరం కావడం మరింత విషాదం నింపింది.
- June 30, 2020
- Archive
- Top News
- క్రైమ్
- HUSBAND
- HUSNABAD
- WIFE
- కొత్తపల్లి
- భార్యాభర్తలు
- హుస్నాబాద్
- Comments Off on భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..