సారథి న్యూస్, హుస్నాబాద్: సోమ, మంగళవారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమతంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. ఈనెల 12,13 తేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని కూడవెల్లి వాగు, మోయతుమ్మెద వాగు, పిల్లివాగు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నాని, పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు నీటి పరీవాహక ప్రాంతాల ప్రజలతో పాటు మత్స్యకారులను చేపలవేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని సూచించారు.
- October 11, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- HEAVYRAINS
- HUSNABAD
- SIDDIPETA
- భారీవర్షాలు
- వాతావరణ శాఖ
- సిద్దిపేట
- సీపీ జోయల్ డేవిస్
- హుస్నాబాద్
- Comments Off on భారీ వర్షాలున్నయ్.. జాగ్రత్తగా ఉండండి