బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన భారీపేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీఎత్తున నిలువుఉంచిన అమ్మోనియం నైట్రేట్ పేలండం వల్ల ఆ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పలు భవనాలు కుప్పకూలాయి. అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. కొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారని లెబనాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. భారీ ఆస్తినష్టం సంభవించినట్టు సమాచారం. కాగా ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక, ఉగ్రవాదుల పనా అన్నకోణంలో దర్యాప్తు జరుగుతున్నది. బీరుట్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంతమంది మరణించారన్న విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.