Breaking News

భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్​ఐఏ ( నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్​ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్​ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్​ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్​ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతుంటే పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదం రెచ్చిపోతున్నది. స్థానికంగా ఉండే స్లీప్​సెల్లర్స్​ సహకారంతో ఉగ్రవాదులు భారీ కుట్రలకు తెగపడుతున్నారు. ఎన్​ఐఏ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రకుట్రను భగ్నం చేసింది.