Breaking News

భారత్ వర్సెస్​ ఆస్ర్టేలియా

  • డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్​లో తొలి టెస్ట్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత భారత్ క్రికెట్ జట్టు అతి పెద్ద టెస్ట్ సిరీస్​కు రెడీ అవుతోంది. డిసెంబర్ 3 నుంచి ఆస్ర్టేలియాలో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇండో–ఆసీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ, క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) విడుదల చేశాయి. నాలుగు టెస్ట్​ల్లో భాగంగా తొలి మ్యాచ్ బ్రిస్బేన్​లో జరగనుంది. ఆసీస్​లో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో నాలుగు మ్యాచ్​లకు నాలుగు వేదికలను ఖరారు చేశారు.

అప్పటివరకు వైరస్ వ్యాప్తి పెరిగితే అన్ని మ్యాచ్​లు ఒకే వేదికపై నిర్వహించేలా కూడా ప్రణాళికలు రూపొందించారు. తర్వాతి మూడు మ్యాచ్​లు వరుసగా అడిలైడ్ (డే అండ్ నైట్ టెస్ట్), మెల్​బోర్న్​, సిడ్నీలో జరగనున్నాయి. 2020–21 సీజన్​కు గానూ సీఏ తమ మొత్తం షెడ్యూల్​ను ప్రకటించనుంది. దాదాపు ఐదుదేశాలు ఆసీస్​లో పర్యటించేలా ఈ షెడ్యూల్​ ను రూపొందిస్తున్నారు.

కరోనాతో ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో ఐదో టెస్ట్ కూడా ఆడదామని సీఏ ప్రతిపాదించినా.. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్​ను నాలుగు టెస్ట్​లకే పరిమితం చేశారు. ఈ సిరీస్ కోసం వెళ్లే టీమిండియా అవసరమైతే 14 రోజులు ఐసోలేషన్​లో ఉండేందుకు కూడా సిద్ధమేనని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు.