న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో… 1,35,206 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నది. మరో 1,33,632 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వైద్యశాఖ వెల్లడించింది. దాదాపు 48.99 శాతం మంది కోలుకుంటున్నట్టు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. మనదేశంలో గత 24 గంటల్లో 9985 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,76,583కు చేరింది.