Breaking News

భయపెట్టిన భారీ తాచు

షార్ట్ న్యూస్

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలోకి 15 అడుగుల భారీ తాచుపాము వచ్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని కొందరు యువకులు ఆ పామును చంపేందుకు యత్నించగా వారికి చిక్కలేదు. దీంతో అటవీఅధికారులను సమాచారమిచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకొని ఆ పామును సజీవంగా బంధించారు. అనంతరం సమీపంలోని సిరువాని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నది.