Breaking News

బ్యాంకుల నుంచి భారీగా..

బ్యాంకుల నుంచి భారీగా..
  • పీఎం కేర్స్‌కు రూ.349 కోట్ల విరాళం
  • సీఎస్ఆర్ కింద అంద‌జేసిన ప్ర‌భుత్వ బీమా సంస్థ‌లు

న్యూఢిల్లీ : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి, దానిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి త‌గిన స‌దుపాయాలు క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రైమ్ మినిస్ట‌ర్ సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్‌ ఎమ‌ర్జెన్సీ సిట్యూయేష‌న్స్ (పీఎంకేర్స్‌)కు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌ల నుంచి భారీగా విరాళాలు అందాయి. సుమారు ఏడు ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌లు క‌లిపి ఈ నిధికి రూ.349.25 కోట్ల విరాళంగా ప్ర‌క‌టించాయి. ఆర్టీఐ ద్వారా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకెళ్తే.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ)తో పాటు ఎస్ బీఐ, కెన‌రా బ్యాంకు, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, స్మాల్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ (ఎస్ఐడీబీఐ), జీఐసీ, నాబార్డ్‌, ఐఆర్‌డీఐ వంటి సంస్థ‌ల‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు వారి ఒక్క‌రోజు వేత‌నాన్ని పీఎం కేర్స్‌కు విరాళంగా అందించారు. ఇందులో ఎస్బీఐ రూ.107.95 కోట్లు ఇవ్వ‌గా.. కెన‌రా బ్యాంకు రూ.15.53 కోట్లు, యూబీఐ రూ.14.81 కోట్లు, సెంట్ర‌ల్ బ్యాంకు రూ.11.89 కోట్లు, నాబార్డు రూ.9 కోట్లు విరాళంగా అందించాయి. ఇక బీమా సంస్థ‌ల విష‌యానికొస్తే.. ఎల్ఐసీ, జీఐసీ, నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంకులు క‌లిపి రూ.144.5 కోట్లు కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) కింద విరాళం ప్ర‌క‌టించాయి. వీటిలో ఒక్క ఎల్ఐసీనే రూ.113.63 కోట్లు (వంద కోట్ల సీఎస్ఆర్ ఫండ్‌, రూ.8.64 కోట్ల ఉద్యోగుల ఒక్క‌రోజు వేత‌నం, రూ.5కోట్లు గోల్డెన్ జూబ్లీ ఫౌండేష‌న్‌) ఇచ్చింది.